📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదసరా పండుగ సందర్భంగా అలాయ్ బలాయ్ కార్యక్రమం

దసరా పండుగ సందర్భంగా అలాయ్ బలాయ్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

దసరా పండుగ సందర్భంగా అలాయ్ బలాయ్ కార్యక్రమం

• తర్జన్‌పల్లిలో రేపు అలాయ్ బలాయ్.. ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనర్సింహ

మన ప్రజావాణి అక్టోబర్ 22 అందోల్ : జిల్లా ప్రతినిధి

దసరా పండుగ సందర్భంగా అందరినీ కలుసుకుని ఆత్మీయత, సోదరభావాన్ని పంచుకునేందుకు తర్జన్‌పల్లి గ్రామంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో రేపు అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా అందోల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. దసరా పండుగ నేపథ్యంలో అందరినీ కలుసుకుని ఆత్మీయతను పంచుకునే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.