📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ- నిర్మలా జగ్గారెడ్డి

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ- నిర్మలా జగ్గారెడ్డి

📰 Generate e-Paper Clip

*తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ- నిర్మలా జగ్గారెడ్డి*

మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి అక్టోబర్:17

*సదాశివపేట, సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి*

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో అన్ని శాఖల ఉద్యోగులు, తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.

రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ ఆటపాటలతో కలెక్టరేట్‌ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు బతుకమ్మల చుట్టూ వలయంగా ఏర్పడి ఉత్సాహంగా ఆడిపాడారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆలపించిన బతుకమ్మ పాటలు వేడుకలకు మరింత ఉత్సాహాన్ని చేకూర్చాయి. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ సంగీత,DMHO లలితా దేవి, కలెక్టరేట్ లోని మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు

సదాశివపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సదాశివపేట లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లోనూ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకృతిని పూజించే అరుదైన పూల పండుగ బతుకమ్మ తెలంగాణకు ప్రత్యేకమని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఈ పండుగ చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం లో సదాశివపేట మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుకా చిరు, కౌన్సిలర్ లు, ఉద్యోగులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.