తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ- నిర్మలా జగ్గారెడ్డి
*తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ- నిర్మలా జగ్గారెడ్డి* మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి అక్టోబర్:17 *సదాశివపేట, సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి* తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని నిర్మల జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో అన్ని శాఖల ఉద్యోగులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ ఆటపాటలతో కలెక్టరేట్ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది....