**తెలంగాణ పబ్లిక్ స్కూల్ – మంచాల**
*తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ నవీన్ నికోలస్ ఐఏఎస్ గారు ఈరోజు మంచాల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను* సందర్శించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. అక్టోబర్ 9 మంచాల (ప్రజావాణి) తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో, కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
నవంబర్ నెలలో పాఠశాలను ప్రారంభించేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు తల్లిదండ్రుల కమిటీ నుంచి ఉపకమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళిక ప్రకారం పాఠశాల తరగతి గదులతో పాటు కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ వెంకటేశ్వర్లు గారు, తెలంగాణ విద్యా కమిషన్ ఓఎస్డీ శ్రీమతి జీనత్ గారు, ఈఈ రామ్‌కుమార్ గారు, నాగర్‌కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి గారు, మంచాల మండల విద్యాధికారి శ్రీ రాందాస్ గారు, ఎమ్మార్వో ఎం.వి.వి.ఎస్. ప్రసాద్ గారు, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు వాణి గారు, నోడల్ అధికారి కిషన్ చౌహన్ గారు, ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీ గిరిధర్ గౌడ్ గారు, నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
అలాగే మంచాల పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు బాల్‌రాజ్, లింగం, సురేష్, వెంకటేష్, సుధాకర్, విజయలక్ష్మి, రాణి, శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

