తెలంగాణ పబ్లిక్ స్కూల్ – మంచాల
**తెలంగాణ పబ్లిక్ స్కూల్ – మంచాల** *తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ నవీన్ నికోలస్ ఐఏఎస్ గారు ఈరోజు మంచాల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను* సందర్శించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. అక్టోబర్ 9 మంచాల (ప్రజావాణి) తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో, కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. నవంబర్ నెలలో పాఠశాలను ప్రారంభించేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు తల్లిదండ్రుల కమిటీ నుంచి ఉపకమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళిక ప్రకారం పాఠశాల...