📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణడి 765 రహదారి డిజైన్ లోపం . జరుగుతున్న ప్రమాదాలు

డి 765 రహదారి డిజైన్ లోపం . జరుగుతున్న ప్రమాదాలు

📰 Generate e-Paper Clip

డి 765 రహదారి డిజైన్ లోపం . జరుగుతున్న ప్రమాదాలు

గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు. 

డి 765 రహదారి జరుగుతున్న ప్రమాదాలు

ఈ రహదారి డివిజన్ లోపంపై జిల్లా కలెక్టర్ స్పందించి ప్రమాదాలు జరగకుండా అరికట్టాలి 

నసుల్లాబాద్ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి

నసురుల్లాబాద్ అక్టోబర్ 26 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో సోమవారం నిర్మాణము జరుగుతున్న డి 765 రహదారి నిర్మాణం పనులు సక్రమంగా లేక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని నసుల్లాబాద్ సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు ఇచ్చిన అవినీతిపత్రంలో పేర్కొన్నారు మెదక్ నుంచి  రుద్రూర్ వరకు 898 కోట్ల రూపాయలతో 96 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. రహదారి పనుల డిజైన్ లోపం వలన ఇప్పటి వరకు మా మండలములో 12 మరణాలు సుమారు 60 పైన క్షతగాత్రులు పాలయ్యారని సర్పంచులు వెల్లడించారు.

క్షేత్ర స్థాయిలో జరుగుతున్న విషయాలు

 ప్రాణాలు తీస్తున్న 10 మీటర్ల ఇరుకు రోడ్డు జాలీలు

సర్వీసు రోడ్డు వచ్చిన దగ్గర ప్రధాన రహదారి 10 మీటర్లు మాత్రమే ఉన్నది. దానికి ఇరువైపుల డ్రైనేజి కట్టి దానిపై జాలీలు అమర్చినారు. ఈ 10 మీటర్లలోనే రెండు వైపుల వాహనాలు రెండు వరసల రహదారిపై వెళ్లాలి. రోడ్డు ఇరుకుగా మారి జాలీల వలన పక్కకు తప్పుకునే అవకాశం లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటుందని సర్పంచులు వెల్లడించారు.. దీని వల్ల గత 6 నెలలలో 12 మంది గాలిలో కలిసిపోగా -. 60 కాళ్లు ,చేతులు కోల్పోయి మంచం పడ్డారని వారు వెల్లడించారు.ఈ జాలీల మద్యలో పొరపాటున ఓవర్ టేక్ చేస్తే ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించు-కోలేక ప్రమాదము తప్పడం లేదంటూ సర్పంచులు పేర్కొన్నారు.. గ్రామాలు లేని చోట కూడా అనవసర జాలీల వలన మరింత ప్రమాదాలు చోటు చేసుకుంటుందన సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు గ్రామాల మధ్య ఇండ్లు , జన సంచారం లేని వద్ద కూడా అనవసరంగా డ్రైనేజి, జాలీలు పెట్టి రోడ్డును కష్టతరంగాను, ప్రమాదకరంగా మార్చాలని సర్పంచులు ఆరోపించారు, ఉన్న కొంచెం సేప్టి కూడా లేకుండా చేసినారు.జాలీలు లేని దగ్గర కూడా 10 మీటర్ల రోడ్డు మాత్రమే ఉన్నప్పటికి ప్రక్కన మట్టి రోడ్డు (బరం) ఉండటం వలన ఏదైన ప్రమాదము అనిపిస్తే డ్రైవర్ వాహనాన్ని ప్రక్కకు నడిపి ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది.డ్రైనేజి వలన గ్రామాలకు నరకం, పచ్చదనానికి చోటు లేదు.డ్రైనేజి సర్వీసురోడ్డుకు మేన్ రోడ్డుకు మద్యలో పెట్టడం వలన గ్రామాల నుండి వచ్చే మురుగు నీరు వర్షపు నీరు డ్రైనేజిలకు వెళ్లడం అంటూ సర్పంచులు ఆరోపించారు. ఆ నీరు అంతా సర్వీసు రోడ్డు మీదికి వచ్చి రోడ్లు మురుగు మయం మారుతున్నాయంటూ వారు వెల్లడించారు.  మద్యలో ఉన్న డ్రైనేజిలో చేరిన నీరు బయటకు వెళ్లడానికి ఎలాంటి మార్గం లేదు. అందులో చేరిన నీటి వలన దుర్గందం బయటకు వస్తుందని సర్పంచులు వెల్లడించారు.. గ్రామాలలో దోమల బెడద ఎక్కువ అయింది. సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు ఇంకా చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని నసుల్లాబాద్ మండల సర్పంచులు , ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాపతి నిధులు తీవ్రంగా మండిపడుతున్నారు .ఒకవేళ మద్యలో డివైడర్ ఇచ్చి ఫోర్ వే  చేసి ఉంటే ట్రాఫిక్ సులభంగా వెళ్లడానికి వీలుంటుంది అంతేకాకుండా ప్రమాదాలను అరికట్టవచ్చునన వారు వెల్లడించారు . రోడ్లకు ఇరువైపులా మొక్కలతో పెంచుకోవడానికి స్థలం లేకుండా చేస్తున్నారని కాంట్రాక్టర్ పనితీరుపై సర్పంచులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

సర్పంచుల, ప్రజా ప్రతినిధుల డిమాండ్లు ఇవే

 ఈ ప్రమాదకరమైన జాలీల డిజైన్లు రద్దు చేసి మద్యలో డివైడర్తో కూడిన ఫోర్ లైన్ విధానాన్ని అమలు చేసి డ్రైనేజిని రోడ్డు చివరకు మార్చాలి.

. గ్రామాలు లేని చోట అనవసరంగా ఏర్పాటు చేసిన డ్రైనేజి, జాలీలను వెంటనే తొలగించి మట్టి బూజులు

ఏర్పాటు చేయాలి.రోడ్డు అభివృద్ది ప్రజలకు సౌకర్యం పెంచుట కొరకు ఏర్పాటు చేయాలి. కాని ప్రాణాలు తీయడానికి కాదు అంటూ సర్పంచులు తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.