📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణటాస్ పదో తరగతి, ఇంటర్‌ అడ్మిషన్ల గడువు అక్టోబర్‌ 12 వరకు పొడగింపు

టాస్ పదో తరగతి, ఇంటర్‌ అడ్మిషన్ల గడువు అక్టోబర్‌ 12 వరకు పొడగింపు

📰 Generate e-Paper Clip

టాస్ పదో తరగతి, ఇంటర్‌ అడ్మిషన్ల గడువు అక్టోబర్‌ 12 వరకు పొడగింపు..

పరిగి, అక్టోబర్ 01, ప్రజావాణి:

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్ )ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పుట్టపహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేంద్ర బహదూర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హులైన అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబర్ 12వ తేదీ వరకు అడ్మిషన్ ఫీజు చెల్లించి ప్రవేశాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల చదువును మధ్యలోనే ఆపేసిన వారు, రెగ్యులర్ పాఠశాల విద్యను కొనసాగించలేకపోయిన వారికి ఓపెన్ స్కూల్ విధానం ఒక చక్కటి అవకాశమని అన్నారు.
టాస్ ద్వారా పదో తరగతితో పాటు ఇంటర్మీడియట్ స్థాయిలో హెచ్‌ఈసీ (HEC), సీఈసీ (CEC), ఎంఈసీ (MEC) వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇక్కడ పొందే విద్యార్హతలు భవిష్యత్తులో ఉన్నత చదువులకు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు పూర్తిగా ఉపయోగపడతాయని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు గడువు ముగిసే వరకు వేచి ఉండకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు, ప్రవేశాల కొరకు 96038 09070, 88979 27485 నంబర్లను సంప్రదించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.