📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణటాలెంట్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

టాలెంట్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

📰 Generate e-Paper Clip

టాలెంట్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సంప్రదాయాల ప్రతీక బతుకమ్మ పండుగ-ప్రిన్సిపాల్ భూపాల్ రెడ్డి

డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి అక్టోబర్ 9 ప్రజావాణి:
మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు పాఠశాల ప్రిన్సిపాల్ భూపాల్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రీతి రెడ్డి, డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు భక్తిశ్రద్ధలతో ఆనంద ఉత్సవాలతో ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయురాలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, విద్యార్థినులు సంప్రదాయ దుస్తులైన లంగా వోని ,చీరలు ధరించి పండుగ శోభను తీసుకొచ్చారు , పాఠశాల ఆవరణ బతుకమ్మ పాటలతో పాటలతో మారుమోగింది. బతుకమ్మలను మధ్యలో పెట్టి చుట్టూ ఆటపాటలతో చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆటను ప్రదర్శించారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
పాఠశాలలో పండగ వాతావరణం నెలకొల్పడంతోపాటు విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన పెరుగుతుందని ఇలాంటి వేడుకలు ద్వారా పిల్లలు మన సంప్రదాయాలకు దగ్గరగా అవుతారని పాఠశాల ప్రిన్సిపల్ డైరెక్టర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
వార్త వ్రాయండి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.