📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజీఎంఆర్‌ కాలనీ నీటి కష్టాలకు చెక్‌ పడేనా

జీఎంఆర్‌ కాలనీ నీటి కష్టాలకు చెక్‌ పడేనా

📰 Generate e-Paper Clip

*జీఎంఆర్‌ కాలనీ నీటి కష్టాలకు చెక్‌ పడేనా..?*

*రెండు రోజుల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు హామీ*

*శాశ్వత పరిష్కారానికి అన్ని పార్టీల ఉమ్మడి కార్యాచరణ*

*గడ్డపోతారం మున్సిపాలిటీ ప్రజాప్రతినిధుల సానుకూల స్పందన*

జిన్నారం, అక్టోబర్‌ 12 (ప్రజావాణి): గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోగల కాజిపల్లి లోని జీఎంఆర్‌ కాలనీ సర్వేనెంబర్ 181లో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యకు పరిష్కారం లభించే దిశగా అడుగులు పడ్డాయి. నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసులకు రెండు రోజుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని మున్సిపల్‌ ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. సోమవారం కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యపై మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌, 6వ వార్డు కౌన్సిలర్‌ కుమార్‌ యాదవ్‌, బీఆర్ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి గణేష్‌తో కాలనీ ప్రతినిధులు చర్చించారు.
ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న నీటి ఎద్దడి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యపై సానుకూలంగా స్పందించిన ప్రజాప్రతినిధులు తక్షణ ఉపశమనంగా రెండు రోజుల్లో వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చినట్లు కాలనీ వాసులు తెలిపారు. కాజిపల్లితో పాటు జీఎంఆర్‌ కాలనీ (సర్వేనెంబర్ 181)లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల సమన్వయంతో కృషి చేస్తామని పేర్కొన్నట్లు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.