📄 ePaper
Epaper 2
Saturday, October 3, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaచండూర్ మెయిన్ రోడ్డులో నీటి వృధా

చండూర్ మెయిన్ రోడ్డులో నీటి వృధా

📰 Generate e-Paper Clip

చండూర్ మెయిన్ రోడ్డులో నీటి వృధా – భవాని ఫంక్షన్ హాల్ ఎదురుగా బోర్ వాటర్ లీకేజీ తో రోడ్డు పైకి వృధాగా నీరు!

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై, భవాని ఫంక్షన్ హాల్ ఎదురుగా గల బోర్ వాటర్ పైప్ లైన్ లీకేజీ కారణంగా నీరు వృధాగా రోడ్డు పైకి వస్తున్నది. గత కొద్ది రోజులుగా మెయిన్ రోడ్డు కింద ఉన్న బోర్ వాటర్ పైప్ లీక్ అవ్వడంతో వేల లీటర్ల నీరు వృధాగా పోతున్నది. దీనివల్ల ఒకవైపు ప్రజలు నీటి ఎద్దడి తో ఇబ్బంది పడుతుంటే, మరోవైపు ఇలా నీరు వృధా కావడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం నీరు రోడ్డు పైకి రావడంతో మెయిన్ రోడ్డు గుంతలు పడి దెబ్బతినే ప్రమాదం ఉంది. రోడ్డుపై నీరు నిలవడంతో వాహనదారులు, పాదచారులు జారిపడే ప్రమాదం ఉంది. ఈ లీకేజీని గుర్తించి వెంటనే మరమ్మతులు చేయాల్సిన మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, భవాని ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న బోర్ వాటర్ లీకేజీ ని అరికట్టి, నీటి వృధా ను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.