ఘనంగా ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలు
అక్టోబర్ 10 ప్రజావాణి న్యూస్/సంగెం
సంగెం మండలంలోని అన్ని గ్రామాలలోమహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయబద్ధంగా ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ సందడి చేశారు.
ఈ సందర్భంగా మహిళల ఉత్సాహంతో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవడం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అన్ని ఏర్పాట్లు గ్రామాల్లో గుడి ఆవరణంలో చెరువు కట్టల దగ్గర కాంతి వెలుగులతో ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్లకు గ్రామ పంచాయతీ సిబ్బంది లో అందరికీ మహిళలందరూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు

