📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్గ్రామీణ ఆరోగ్యానికి కేంద్ర పథకాలే కొండంత అండ: కే.ఎన్.కొట్టాలలో వైభవంగా అంగన్‌వాడీ ఉత్సవాలు

గ్రామీణ ఆరోగ్యానికి కేంద్ర పథకాలే కొండంత అండ: కే.ఎన్.కొట్టాలలో వైభవంగా అంగన్‌వాడీ ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

మోదీ సుపరిపాలనపై ‘సేవా సంకల్ప్ అభియాన్’ వేడుకలు

బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఎదురు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు ఘన సత్కారం

కాశినాయన అక్టోబర్ 05 ప్రజావాణి:కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అండతోనే దేశంలో ఆరోగ్యవంతమైన, పటిష్టమైన ‘సుపోషిత భారత్’ నిర్మాణం సాధ్యమవుతుందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘ ప్రజా ప్రస్థానం, సంస్కరణల సుపరిపాలనను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ లో భాగంగా బుధవారం కాశినాయన మండలం కే.ఎన్.కొట్టాల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్వాడి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. బీజేపీ కాశినాయన మండల అధ్యక్షుడు బిజీవేముల నారాయణరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఎదురు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా సాగింది.మహిళా శిశు సంక్షేమ శాఖ నేతృత్వంలో జరిగిన అంగన్వాడి ఉత్సవాల వేడుకలకు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అంగన్‌వాడీ ఉత్సవాల బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుసిరెడ్డి మనోహర్ రెడ్డి,అంగన్వాడి సూపర్వైజర్లు చంద్రకళ ,హరిప్రియ ముఖ్య అతిథులుగా హాజరయ్యారుసాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని వారు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం మహిళల, బాలల సంక్షేమానికి,వారి ఆరోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.దేశవ్యాప్తంగా పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అనేక విప్లవాత్మక పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.సమాజంలో గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడటంలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర ఎంతో కీలకమైనదని వారు కొనియాడారు. క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా అభినందించారు.ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని మరియు సంక్షేమ పథకాలను లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పౌష్టికాహార ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న నాణ్యమైన గుడ్లు, పాలు, బాలామృతం కిట్లు, చిరుధాన్యాల (మిల్లెట్స్) విశిష్టతను అధికారులు, నేతలు లబ్ధిదారులకు క్షుణ్ణంగా వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులు రక్తహీనత (ఎనీమియా) బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. చిన్నారులకు సకాలంలో వ్యాక్సినేషన్ (టీకాలు) వేయించాల్సిన ఆవశ్యకతను తల్లులకు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పోషణ్ అభియాన్’, ‘ప్రధానమంత్రి మాతృ వందన యోజన’ వంటి పథకాలు గ్రామీణ పేదలకు కొండంత అండగా నిలుస్తున్నాయని నేతలు కొనియాడారు. అనంతరం సమాజం కోసం నిస్వార్థంగా సేవలందిస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆశా కార్యకర్తలను నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధీర్, బిజెపి కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఎదురు నాగార్జున రెడ్డి, బిజెపి మండల ఉపాధ్యక్షుడు సురేష్ నాయుడు, బిజెపి మండల కార్యదర్శిలు ప్రతాప్ రెడ్డి, కొక్కంటి పవన్, ఎదురు చెన్నారెడ్డి, గర్భిణీలు బాలింతలు అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆశ వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.