📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగుగ్గిళ్లలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గుగ్గిళ్లలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

గుగ్గిళ్లలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

బెజ్జంకి, అక్టోబర్ 2 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామ పంచాయతీ ఆవరణలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
అనంతరం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లను సక్రమంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ దూగ్యని లావణ్య-మోహన్, వార్డు సభ్యులు పంతంగి వెంకటేష్, సీత రేణుక, పోతూ భూలక్ష్మి, కొంకటి సంపత్, కొంకటి కుమార్, కొంకటి సురేష్, పంచాయతీ కార్యదర్శి వంశీ, వీవోఏ భాగ్య, మహిళా సంఘం అధ్యక్షురాలు వసంత, గుగ్గిళ్ల రాజేష్, పోతూ శ్రీను, అంగన్వాడీ టీచర్లు శోభ, భారతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.