గీతాంజలి హై స్కూల్ జవహర్ నగర్ లో ఘనంగా బతుకమ్మ పండగ ఉత్సవాలు:
జవహర్ నగర్ అక్టోబర్ 10:( ప్రజావాణి ప్రతినిధి):
గీతాంజలి హై స్కూల్ జవహర్ నగర్ లో ప్రిన్సిపాల్ కృష్ణవేణి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఉత్సవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కృష్ణవేణి మాట్లాడుతూ బతుకమ్మ పండగ విశిష్టతను తెలియజేస్తూ మనం పకృతిని కాపాడడం, పువ్వులను పూజించడం, బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారని 9వ రోజున సద్దుల పండుగ ఘనంగా జరుపుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ చైర్మన్ నాగరాణి, టీచర్లు మరియు పాఠశాల విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

