కొత్తపేటలో బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి అక్టోబర్ 09(ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో శోకసంద్రంలో ఉన్న పలు కుటుంబాలను శుక్రవారం రోజున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కొప్పుల శేఖర్ కుటుంబ సభ్యులను కలిసిన ఆయన, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బాధితులకు ఆర్థిక సహాయం అందజేసి భరోసానిచ్చారు. అనంతరం అదే గ్రామానికి చెందిన బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంతరావు తండ్రి నారాయణ రావు...