📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకొత్తపల్లి కళమ్మ దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించిన శ్రీ మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ అధ్యక్షుడు అంతటి...

కొత్తపల్లి కళమ్మ దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించిన శ్రీ మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ అధ్యక్షుడు అంతటి రాజుగౌడ్

📰 Generate e-Paper Clip

*కొత్తపల్లి కళమ్మ దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించిన శ్రీ మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ అధ్యక్షుడు అంతటి రాజుగౌడ్*

మంచాల: రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 22 (ప్రజావాణి):మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన శ్రీ మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ సభ్యుడు కొత్తపల్లి శేఖర్ గౌడ్ తల్లి కొత్తపల్లి కళమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ఆరుట్ల శ్రీ మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ అధ్యక్షుడు అంతటి రాజుగౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చెరుకు నరసింహగౌడ్, వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాండాల సత్యనారాయణగౌడ్, తాళ్ల ప్రభాకర్ గౌడ్, మాడుగుల యాదయ్యగౌడ్ (కామ్రేడ్), అంతటి జానకిరామ్ గౌడ్, మాధగోని కాటంరాజు గౌడ్, బత్తుల రాజుగౌడ్, ఓరిగంటి మహేష్ గౌడ్, బోయపల్లి జంగయ్య, సుంకరి శ్రీనివాస్ గౌడ్, పోలమోని నాగేష్ ముదిరాజ్, బలం జంగయ్య, మాడుగుల ధనరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.