📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకొడకండ్ల మండలంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విస్తృత పర్యటన

కొడకండ్ల మండలంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విస్తృత పర్యటన

📰 Generate e-Paper Clip

కొడకండ్ల మండలంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విస్తృత పర్యటన

అభివృద్ధి – సంక్షేమం – పరామర్శ – ఒకే రోజు నాలుగు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

లక్ష్మక్కపల్లిలో PHC ప్రారంభం, మహిళా భవనానికి శంకుస్థాపన – మొండ్రాయి, కడగుట్ట తండాల్లో బాధిత కుటుంబాల పరామర్శ

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, బాధితులకు అండగా పనిచేస్తున్నాం: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 28(ప్రజావాణి): జిల్లా లోని
పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలంలో శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి మంగళవారం రోజంతా విస్తృతంగా పర్యటించారు. ఒకే రోజు నాలుగు ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొని అటు అభివృద్ధి, ఇటు మానవత్వం రెండూ చాటుకున్నారు.
కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగానే వైద్యం అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఈ పీహెచ్ సి వల్ల చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలకు అత్యవసర సమయాల్లో సకాలంలో చికిత్స అందుతుంది. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా చూస్తాం” అని అన్నారు.
అదే లక్ష్మక్కపల్లి గ్రామంలో మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

“మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మహిళా సంఘాలకు అనువైన వసతులు కల్పించడం ముఖ్యం. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ భవనం ఉపయోగపడుతుంది. ఇక్కడ కుట్టు మిషన్, వివిధ ఉపాధి శిక్షణలు ఇవ్వవచ్చు” అని తెలిపారు.
మొండ్రాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మచ్చ మల్లేష్ మరియు వీఆర్ఏ ఐలబోయిన రాజు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించి, చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మండలం లోని కడగుట్ట తండాకు చెందిన వల్యా నాయక్ గ ఇటీవల మృతి చెందడంతో, ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్టకాలంలో ఉన్న ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. “మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను, ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయం త్వరగా అందేలా చూస్తాను” అని భరోసా కల్పించారు.

ఈ నాలుగు కార్యక్రమాల్లో మండల అధ్యక్షుడు సురేష్ నాయక్, డీసీసీ కార్యదర్శి ధర్మారపు బిక్షపతి,స్థానిక సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వైద్యాధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.