కేత్ బచావో అభియాన్ కార్యక్రమం పై అధికారిక నివేదిక
ప్రజావాణి అక్టోబర్ 26 కమలాపూర్ మండల్ గూనిపర్తి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో కేతు బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ ఎం ప్రతాప్ గునిపర్తి గ్రామ సర్పంచ్ రాధిక కరుణాకర్ ఉప సర్పంచ్ ముడిదే కిట్టు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ప్రస్తుత వాతావరణం పరిస్థితులు వర్షాభావం భూగర్భ జలాల కొరత కారణంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులకు అవగాహన కల్పించారు వర్షాలు లేకపోవడం వల్ల సాగునీటి లభ్యత తగ్గి వ్యవసాయ బోర్లా ద్వారా నీటిని తోడడం కష్టమవుతుందని తద్వారా వ్యవసాయ విద్యుత్ సరఫరా పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు
ఎల్ ని ఓ ప్రభావం మరియు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృశ్య భూగర్భ జలాల లభ్యత తగ్గే అవకాశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ సీజన్లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల మొక్కజొన్న కూరగాయలు తదితర పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు
నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని అందుబాటులో ఉన్న నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించడం జరిగింది తద్వారా సాగు ఖర్చులను తగ్గించడంతో పాటు నీటి కొరత కారణంగా పంట నష్టాలు సంభవించే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు
ఈ కార్యక్రమాల ద్వారా రైతుల్లో నీటి సంరక్షణ ప్రత్యామ్నాయ పంటల సాగు మరియు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై అవగాహన కల్పించడం జరిగింది

