కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని మంత్రి వివేక్ కు వినతి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 24(ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్, మైన్స్ & జియాలజీ శాఖ మంత్రి జి.వివేక్ వెంకట్ స్వామి ని కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి (CAPSS) జాతీయ అధ్యక్షులు డా. జేరిపోతుల పరశురామ్ శనివారం కలిశారు.
భారత కరెన్సీ నోట్లపై భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వానికి అధికారిక లేఖ రాయాలని కోరారు.
అనంతరం డా. పరశురామ్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు ఆర్బిఐ ఏర్పాటుకు మార్గదర్శకులు, కార్మికులకు 8 గంటల పని, ESI, PF వంటి ఎన్నో హక్కులు కల్పించిన దార్శనికుడు అని, అలాంటి వ్యక్తి ఫొటోను నోట్లపై వేయడం ద్వారా దేశం రుణం తీర్చుకున్నట్లు అవుతుందని అన్నారు. ఇది దేశవ్యాప్తంగా కోట్లాది మంది దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ ప్రజల మనోభావమని తెలిపారు.
మంత్రి వివేక్ వెంకట్ స్వామి సానుకూలంగా స్పందిస్తూ, ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

