📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకదం తొక్కిన ముదిరాజులు

కదం తొక్కిన ముదిరాజులు

📰 Generate e-Paper Clip

*కదం తొక్కిన ముదిరాజులు*

*జిన్నారంలో భారీ ర్యాలీ.. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన*

*బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి చేర్చాలని ప్రభుత్వానికి వినతి*

జిన్నారం, అక్టోబర్‌ 8 (ప్రజావాణి):
ముదిరాజులను బీసీ–డీ నుంచి బీసీ–ఏ కేటగిరీలోకి చేర్చాలని డిమాండ్‌ చేస్తూ పటాన్‌చెరువు నియోజకవర్గంలోని జిన్నారం మండల ముదిరాజులు కదం తొక్కారు. పార్టీలకు అతీతంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి ముదిరాజ్‌ కులబాంధవులు, సంఘాల నాయకులు, పెద్దలు భారీగా తరలివచ్చి జిన్నారంలో ర్యాలీ నిర్వహించారు. బీసీ–ఏలో చేర్చడంతో పాటు తమ హక్కులు, సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ తహసీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు.
ఆరు ప్రధాన డిమాండ్లు..
ముదిరాజులను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మార్చి బీసీ–ఏ ప్రయోజనాలను అమలు చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి వారి ఉపాధి, సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. జనాభాకు అనుగుణంగా ముదిరాజులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవకాశాలతో పాటు నామినేటెడ్‌ పదవుల్లో సముచిత ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వంలో మంత్రి పదవులు సహా కీలక బాధ్యతల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ముదిరాజుల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.
ర్యాలీ అనంతరం ముదిరాజ్‌ నాయకులు జిన్నారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముదిరాజుల ప్రధాన డిమాండ్‌ను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దీనిపై ఆర్‌ఐ శ్రీనివాస్‌ స్పందిస్తూ వినతిపత్రాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, సమస్యను సంబంధిత అధికారులకు నివేదిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర బీసీ–ఏ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ గుండ్లపల్లి శ్రీనివాస్‌, రాష్ట్ర అడ్వైజర్‌ రవి, ముదిరాజ్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుంకరబోయిన మహేష్‌, మండల ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్‌ ముదిరాజ్‌, ఉపాధ్యక్షుడు గంగు రమేష్‌, బాలు గారి నర్సింలు, ముదిరాజ్‌ సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి, కౌన్సిలర్‌ పోతారం సత్తయ్య, జలగరి మల్లేష్‌, ఎం.పెంటేష్‌, బి.శ్రీనివాస్‌తో పాటు ముదిరాజ్‌ నాయకులు అమ్ములుర్‌ నర్సింగ్‌రావు, పంతులు సత్యనారాయణ, మల్లేష్‌, వీర్నాల సత్యనారాయణ, మాణిక్‌రావు, దువ్వగుంట మల్లేష్‌, పుట్టి భాస్కర్‌, ఎన్‌.సత్యనారాయణ, వెంకటేష్‌ బాల్రాజ్‌, అంతయ్య, పట్నం శ్రీనివాస్‌, పూజారి రాజు, భూసిగారి కృష్ణ, గణేష్‌, రతన్‌, నారాయణ, పెంటయ్య, బిక్షపతి, రమేష్‌, వీరరెడ్డిపల్లి అశోక్‌, కనుకుంట వెంకటేష్‌, వీరన్నగూడెం వీరేష్‌తో పాటు వివిధ గ్రామాల ముదిరాజ్‌ సంఘాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, కుల పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముదిరాజుల న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.