కదం తొక్కిన ముదిరాజులు
*కదం తొక్కిన ముదిరాజులు* *జిన్నారంలో భారీ ర్యాలీ.. తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన* *బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి చేర్చాలని ప్రభుత్వానికి వినతి* జిన్నారం, అక్టోబర్ 8 (ప్రజావాణి): ముదిరాజులను బీసీ–డీ నుంచి బీసీ–ఏ కేటగిరీలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ పటాన్‌చెరువు నియోజకవర్గంలోని జిన్నారం మండల ముదిరాజులు కదం తొక్కారు. పార్టీలకు అతీతంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి ముదిరాజ్ కులబాంధవులు, సంఘాల నాయకులు, పెద్దలు భారీగా తరలివచ్చి జిన్నారంలో ర్యాలీ నిర్వహించారు. బీసీ–ఏలో చేర్చడంతో పాటు తమ హక్కులు, సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ...