కంఠాలి లోనీరు వృథాగా పోకుండా ఉండేందుకు వాటర్ ట్యాంకర్ ను ఏర్పాటు గ్రామ సర్పంచ్ నాగనాథ్
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 12
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కంఠలి గ్రామంలో గ్రామ సర్పంచ్ నాగనాథ్ నీరు వృధా నేలపాలు కాకుండా ముందస్తుప్రత్యేక చర్యలు తీసుకొని నూతనంగా వాటర్ ట్యాంకులను తీసుకువచ్చారు.. ఈ సందర్భంగా సర్పంచ్ నాగనాథ్ మాట్లాడుతూ… గ్రామంలో నీటి వృథా సమస్యను స్వయంగా పరిశీలించి, నీటిని పొదుపు చేయాలనే లక్ష్యంతో 5 వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయించామని
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో సర్పంచ్ నాగనాథ్ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారు.నీటిని వృథా చేయకండి – నీటిని పొదుపు చేయండి!
మన కంఠాలి – మన అభివృద్ధి – మన బాధ్యత! అని ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడడం జరిగింది…

