📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguఏకగ్రీవ సర్పంచ్ కైనా తప్పని అవమానం..

ఏకగ్రీవ సర్పంచ్ కైనా తప్పని అవమానం..

📰 Generate e-Paper Clip

వెంకటాపూర్(రామప్ప) మండలంలో కుల వివక్ష

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన దళిత మహిళా సర్పంచ్ ను నిన్న సాయంత్రం జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో అవమానించారు.
బతుకమ్మను ఎత్తుకొని వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన సర్పంచ్ ను.. మాదిగ మహిళవు మాతో పాటు ఆడవద్దు” అంటూ అధికార పార్టీకి చెందిన కొందరు బీసీ మహిళలు అవమానించినట్లు ఆరోపణ. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సర్పంచ్ బతుకమ్మను ఎత్తుకొనే కుప్పకూలిపోయారు.
విషయం తెలుసుకున్న జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని సర్పంచ్ ను పరామర్శించారు. దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.