📄 ePaper
Epaper 2
Friday, October 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరసన దీక్ష 18వ రోజుకు చేరుకుంది

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరసన దీక్ష 18వ రోజుకు చేరుకుంది

📰 Generate e-Paper Clip

ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరసన దీక్ష 18వ రోజుకు చేరుకుంది

పోతరాజుల విన్యాసాలతో వినూత్న నిరసన

ప్రజావాణి అక్టోబర్ 30 ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల నిరసన దీక్ష 18 రోజులలో చేరుకుంది తెలంగాణ రాష్ట్రం ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్ష నేటికీ 18 రోజులకు చేరుకుంది శాంతియుతంగా పోరాడుతున్న ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో నేడు ఎన్ హెచ్ ఎం మహిళా ఉద్యోగులు బోనాలు ఎత్తి పోతరాజు విన్యాసాలతో వినూత్నంగా నిరసన తెలిపారు బోనమెత్తిన మహిళలు వేప కొమ్మలతో పోతురాజు విన్యాసం చేస్తూ తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేశారు

ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా మాజీ అధ్యక్షులు ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్న హాజరైన ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు

ఈ సందర్భంగా జ్యోత్న మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవ చేసిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను నేడు పట్టించుకోకపోవడం దారుణం 18 రోజులుగా మహిళలు రోడ్డు మీద కూర్చొని బోనం ఎత్తాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వం వైఫల్యమే వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు

సందర్భంగా న్యాయవాద నేతలు మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల పోరాటం న్యాయ బద్దమైనది వారి హక్కుల కోసం న్యాయపరంగా కూడా అండగా ఉంటాం ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు
జేఏసీ నాయకులు మాట్లాడుతూ మేము కోరేది బిక్ష కాదు మా హక్కు 18 రోజులుగా రోడ్డుమీద కూర్చున్నాం పట్టించుకోని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి బోనమెత్తి అమ్మను వేడుకున్నాం పోతరాజు విన్యాసాలతో మా బోస వినిపించాం ఇకనైనా ప్రభుత్వం మా డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు

ప్రభుత్వం వెంటనే చర్చకు పిలిచి న్యాయం చేయకపోతే ఆందోళన మరింత ఉద్రిక్తం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి నరేష్ మొగిలి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ చంద్రమౌళి మల్లేశం ప్రశాంత్ సురేందర్ సరిత రాజేష్ జ్యోతి లావణ్య నర్సింగ్ ఆఫీసర్లు ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.