*తల్లి మందలింపుతో పురుగుల మందు సేవించిన సాయి కృష్ణ మృతి*
గంగారం మండల ప్రతినిధి:- అక్టోబర్ 30. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గంగారం మండల కేంద్రం పరిధిలోని తిరుమల గ్రామం పుట్టల భూపతికి చెందిన, సోలం సాయి కృష్ణ, వయసు 16 సంవత్సరాలు అనే బాలుడు, తల్లి మందలించిందని అక్టోబర్ 20, 2026 విజయదశమి మంగళవారం రోజున గుర్తుతెలియని పురుగుల మందు సేవించి, చికిత్స పొందుతూ.. గురువారం రోజు రాత్రి పది గంటలకు మృతి చెందాడు. ఇట్టి విషయం మీద పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు, గంగారం పోలీస్ సబ్ – ఇన్ స్పెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు.

