📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఎన్. సబితా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమావేశం....

ఎన్. సబితా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమావేశం….

📰 Generate e-Paper Clip

అక్టోబర్ 26న చలో హైదరాబాద్‌ మహాధర్నాను జయప్రదం చేయాలి

 

ఘట్‌కేసర్, అక్టోబర్ 25 (ప్రజావాణి):

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు చింతల యాదయ్య, ఎన్. సబితా పిలుపునిచ్చారు.

ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ చౌదరిగూడలో ఆదివారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్. సబితా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, రెండో పీఆర్సీ ప్రకటించాలని, కనీస వేతనాన్ని నెలకు రూ.30 వేలకు నిర్ణయించాలని, డీఏ వర్తింపజేయాలని కోరారు. అర్హులైన కార్మికులకు పదోన్నతులు కల్పించడంతో పాటు వయోభారం, అనారోగ్యం లేదా మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విధి నిర్వహణలో కార్మికులకు తగిన రక్షణ సదుపాయాలు కల్పించాలని, ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని పేర్కొన్నారు. అక్టోబర్ 26న హైదరాబాద్‌లో జరిగే మహాధర్నాలో మున్సిపల్ కార్మికులతో పాటు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, రవాణా రంగ కార్మికులు పాల్గొని తమ హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో యాదమ్మ, జంగమ్మ, కృష్ణ, నరేష్, పద్మ, సుజాత, ఎల్లమ్మ, జంగయ్య, లక్ష్మణ్, అశోక్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.