ఎన్. సబితా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమావేశం….
అక్టోబర్ 26న చలో హైదరాబాద్ మహాధర్నాను జయప్రదం చేయాలి ఘట్కేసర్, అక్టోబర్ 25 (ప్రజావాణి): మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 26న హైదరాబాద్లో నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు చింతల యాదయ్య, ఎన్. సబితా పిలుపునిచ్చారు. ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ చౌదరిగూడలో ఆదివారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్. సబితా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రేటర్...