*ఇచ్చిన మాట ప్రకారం జర్నలిస్ట్ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*
*ఈనాడు జర్నలిస్ట్ దివంగత దత్తురెడ్డి భార్య కు న్యాక్ లో అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
ఈనాడు జర్నలిస్ట్ దత్తురెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందగా.. అప్పుడు కామారెడ్డి జిల్లాలోని వారి స్వగ్రామం వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి, 4 లక్షలు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. దత్తురెడ్డి భార్య ప్రియాంక కు తన శాఖ పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానని నాడు హామీ ఇచ్చిన మంత్రి.. ఇచ్చిన హామీ మేరకు.. న్యాక్ లో అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ గా ఉద్యోగం కల్పించారు. ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తామని ప్రియాంకకు భరోసా నిచ్చిన మంత్రి.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రికి ధన్యవాదాలు తెలిపిన దత్తురెడ్డి భార్య, కుటుంబ సభ్యులు. ఈనాడు జర్నలిస్ట్ దత్తురెడ్డి కుటుంబానికి ఇచ్చిన మాట ప్రకారం అండగా నిలిచిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపి, హర్షం వ్యక్తం చేసిన పలువురు జర్నలిస్టులు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి… మానవత్వానికి నిదర్శనం అంటున్న జర్నలిస్ట్ లోకం
