📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు

📰 Generate e-Paper Clip

నారాయణఖేడ్ నియోజకవర్గం
:-(ప్రజావాణి)
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు

నారాయణఖేడ్ మండల పరిధిలోని ర్యాలమడుగు గ్రామ శివారులో గల మాణిక్ నాయక్ తండాకు చెందిన లలిత, భర్త రాజు దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన లలిత, రాజు దంపతులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేసి, వారి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన పేదలకు సొంత ఇల్లు కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. సొంత ఇంటి కల నెరవేరడంతో పేద కుటుంబాలకు భరోసా, భద్రత లభిస్తుందని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.