📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఆధ్యాత్మిక విలువలే లక్ష్యం.. ఘట్‌కేసర్‌లో పాస్టర్లు, ఎల్డర్స్‌ సహవాస కూడిక

ఆధ్యాత్మిక విలువలే లక్ష్యం.. ఘట్‌కేసర్‌లో పాస్టర్లు, ఎల్డర్స్‌ సహవాస కూడిక

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, అక్టోబర్ 27 (ప్రజావాణి): మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్‌ మండల పరిధిలోని చౌదరిగూడ వెంకటాద్రి టౌన్‌షిప్‌ ఫేజ్‌–3లో ఉన్న జీసస్‌ సేవ్స్‌ మినిస్ట్రీస్‌ వేదికగా ఘట్‌కేసర్‌ మండల పాస్టర్స్‌ ఎల్డర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో పాస్టర్లు, ఎల్డర్స్‌ సహవాస కూడికను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, వక్తగా విచ్చేసిన ప్రముఖ పాస్టర్‌ డాక్టర్‌ బి. అజయ్‌ పాల్‌ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. క్రైస్తవ విశ్వాసం, ఆధ్యాత్మిక విలువలు, సేవాభావం, సంఘాల అభివృద్ధి ప్రాధాన్యతను వివరిస్తూ సమాజంలో ప్రేమ, ఐక్యత, సేవాభావాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. జీసస్‌ సేవ్స్‌ మినిస్ట్రీస్‌ పాస్టర్‌ ఏ.డి. సిల్వన్‌ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాస్టర్లకు ప్రత్యేక బహుమతులు అందజేసి సత్కరించారు. ఇలాంటి సహవాస కార్యక్రమాలు వివిధ క్రైస్తవ సంఘాల మధ్య ఐక్యత, పరస్పర సహకారాన్ని బలోపేతం చేస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఫెలోషిప్‌ అధ్యక్షుడు రెవ. ఎస్. ఎఫ్రాయిమ్‌, ఉపాధ్యక్షుడు డి. పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి బి. విద్యాసాగర్‌, సంయుక్త కార్యదర్శి రెవ. ఎన్. విజయ్‌ కుమార్‌, కోశాధికారి రెవ. వి. దేవేంద్రప్ప, ప్రోగ్రామ్‌ కన్వీనర్‌ బ్రదర్‌ బి. సుధాకర్‌, కె. ఆనంద్‌తోపాటు పలువురు పాస్టర్లు, ఎల్డర్స్‌, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.