*ఘనంగా ‘అమ్మ రక్షక పురస్కారం’ ప్రదానం.. విశేష సేవలందించిన సిఐ రాజశేఖర్ రెడ్డి కి సత్కారం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ (ASWO) ఆధ్వర్యంలో నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో… సమాజ రక్షణలో అంకితభావంతో నిస్వార్థంగా సేవలందిస్తున్న ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కి ఘనంగా ‘అమ్మ రక్షక పురస్కారం’ అందజేయడం జరిగింది. గతంలో అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అమ్మ సేవా నవరత్న పురస్కారాల వేడుకలకు అనివార్య కారణాల వల్ల హాజరుకాని రాజశేఖర్ రెడ్డి ని, సంస్థ వ్యవస్థాపకులు సురకారపు యాదగిరి గౌడ్, ప్రతినిధులు మంగళవారం స్వయంగా స్టేషన్లో కలిసి శాలువా కప్పి, జ్ఞాపిక బహుకరించి మర్యాదపూర్వకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు దోనాల లింగారెడ్డి, యలజాల శంకర్, అవురోజు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

