ఆధ్యాత్మిక విలువలే లక్ష్యం.. ఘట్‌కేసర్‌లో పాస్టర్లు, ఎల్డర్స్‌ సహవాస కూడిక

ఘట్కేసర్, అక్టోబర్ 27 (ప్రజావాణి): మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్‌ మండల పరిధిలోని చౌదరిగూడ వెంకటాద్రి టౌన్‌షిప్‌ ఫేజ్‌–3లో ఉన్న జీసస్‌ సేవ్స్‌ మినిస్ట్రీస్‌ వేదికగా ఘట్‌కేసర్‌ మండల పాస్టర్స్‌ ఎల్డర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో పాస్టర్లు, ఎల్డర్స్‌ సహవాస కూడికను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, వక్తగా విచ్చేసిన ప్రముఖ పాస్టర్‌ డాక్టర్‌ బి. అజయ్‌ పాల్‌ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. క్రైస్తవ విశ్వాసం, ఆధ్యాత్మిక విలువలు, సేవాభావం, సంఘాల అభివృద్ధి ప్రాధాన్యతను వివరిస్తూ సమాజంలో ప్రేమ, ఐక్యత, సేవాభావాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు....