📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణPeddapalliకార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా

కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా

📰 Generate e-Paper Clip

కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా

టిఆర్పి కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాసిపేట ఉదయ్ కుమార్


ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, సెప్టెంబర్ 14


తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పి) కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దపల్లి మాజీ జిల్లా అధ్యక్షులు కాసిపేట ఉదయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టిఆర్పి అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మాదం రజినీకుమార్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారికి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు అందజేశారు.

కార్మికుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం

ఈ సందర్భంగా నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసిపేట ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల హక్కుల పరిరక్షణే తన ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.

శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులకు అండగా నిలిచి, చట్టబద్ధంగా అందాల్సిన వేతనాలు, సౌకర్యాలు, భద్రత కల్పించేలా క్షేత్రస్థాయిలో పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, గనుల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.

ప్రమాదాల బారినపడే కార్మిక కుటుంబాలకు తక్షణ న్యాయం, ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి కార్మికుడికి నైతిక, చట్టపరమైన మద్దతు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తీన్మార్ మల్లన్న ఆశయాల సాధనలో భాగంగా తెలంగాణలోని ప్రతి కార్మిక కుటుంబానికి రాజ్యాధికార పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా విభాగాన్ని పటిష్టం చేస్తా

రాష్ట్రవ్యాప్తంగా కార్మిక విభాగాన్ని మరింత పటిష్టం చేసి, కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారి గొంతుకగా నిలిచేందుకు అహర్నిశలు కృషి చేస్తానని కాసిపేట ఉదయ్ కుమార్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి నంపుల్లి శివదాస్, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రం సంజీవ్, జిల్లా కార్యదర్శి, మాజీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అడ్లూరి గంగారం, రామగుండం పట్టణ అధ్యక్షులు గుంటి ఆంజనేయులు, ధర్మారం మండలం సోషల్ మీడియా కన్వీనర్ ముత్తునూరి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.