సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దాచారం గ్రామంలో పోలీస్ కళాబృందంచే గ్రామ ప్రజలకు అవగాహన బెజ్జంకి, సెప్టెంబర్ 22 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని దాచారం గ్రామంలో మంగళవారం పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు పాటలు, ప్రదర్శనల ద్వారా పలు సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ అసాంఘికకార్యకలాపాలకు దూరంగాఉండాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని అవగాహన కల్పించారు.అలాగే మహిళలు,బాలల భద్రత, రోడ్డు...