సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: గట్టుప్పల్ ఎస్సై సంపత్
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
సైబర్ క్రైమ్స్ పట్ల విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని గట్టుప్పల్ ఎస్సై సంపత్ అన్నారు. గట్టుప్పల్ హైస్కూల్ నందు బుధవారం ఎస్సై సంపత్ తన సిబ్బందితో కలిసి విద్యార్థులకు సైబర్ క్రైమ్స్, మత్తు పదార్థాలు, దొంగతనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సంపత్ మాట్లాడుతూ – సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తగా ఉండాలని, తెలియని వ్యక్తుల నుండి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంక్ వివరాలను ఎవరికీ చెప్పవద్దని విద్యార్థులకు కూలంకషంగా వివరించారు. అలాగే గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు
నాశనమవుతాయని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడితే భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. గంజాయి వల్ల కలిగే అనర్థాలు, సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేయాలని లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

