📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసుద్దవాగు తండా దాడి ఘటనలో ముగ్గురు రిమాండ్.

సుద్దవాగు తండా దాడి ఘటనలో ముగ్గురు రిమాండ్.

📰 Generate e-Paper Clip

సుద్దవాగు తండా దాడి ఘటనలో ముగ్గురు రిమాండ్.

మరో ఐదుగురు నిందితులు పరారీలో.. త్వరలో అదుపులోకి తీసుకుంటాం: ఎస్సై జగదీష్..

తిరుమలాయపాలెం, ప్రజావాణి,

సుద్దవాగు తండా గ్రామపంచాయతీ పరిధిలో ముజాహిద్‌పురం క్రాస్‌రోడ్డు వద్ద కాంగ్రెస్ నాయకుల కారుపై జరిగిన రాళ్ల దాడి ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్ మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి మండల కాంగ్రెస్ నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, చావా శివరామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు కొప్పుల అశోక్ హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ముజాహిద్‌పురం క్రాస్‌రోడ్డు వద్ద వారి కారుపై రాళ్లతో దాడి జరిగినట్లు బోడ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దాడి అనంతరం నిందితులు పొలాల వైపు పారిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కేసులో భానోత్ కిషన్, బానోత్ మోహన్, బానోత్ రవి తండ్రి భీక్యలను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.
కాగా, ఈ కేసులో భానోత్ కిషన్, బానోత్ మోహన్, వాంకుడోత్ బాలు, బానోత్ శ్రీను, బానోత్ రవి తండ్రి భీక్య, భానోత్ మల్లికార్జున్, బానోత్ సోమన్న, బానోత్ రవి అలియాస్ ఆర్మీ రవిల పేర్లు ఫిర్యాదులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీరిలో ముగ్గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా, వాంకుడోత్ బాలు, బానోత్ శ్రీను, భానోత్ మల్లికార్జున్, బానోత్ సోమన్న, బానోత్ రవి అలియాస్ ఆర్మీ రవి పరారీలో ఉన్నారని ఎస్సై తెలిపారు. పరారీలో ఉన్న వారిని త్వరలో అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టి కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై కూచిపూడి జగదీష్ వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.