షిబ్బి తండాలో ఘనంగా పోషణ మాసం
మద్దూరు సెప్టెంబర్ 18, ప్రజా వాణి,
మండలంలోని హనుమ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని శిబ్బి తండా అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి టిచర్ శారద ఆధ్వర్యంలో ఘనంగా పోషణ మాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సర్పంచ్ బదావత్ లలిత శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పిల్లలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా పాలు,గుడ్లు, ఆకు కూరలు ఆహారంలో తీసుకుంటే పుట్టే బిడ్డ బలంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్ గౌతమి, ఏ ఎన్ ఏం జ్యోతి రాణి, ఆశా కార్యకర్తలు, తల్లులు,పిల్లలు,పాల్గొన్నారు.

