*సంగారెడ్డి రామ్ నగర్ రామ్ మందిర్ గణపతి వేడుకల్లో అలరించిన సంగీత విభావరి*
– భక్తి గీతాలు ఆలపించిన సినీ నేపథ్య గాయకులు
– మండపంలో డోలక్ వాయిస్తూ భజన పాటలు పాడిన జగ్గారెడ్డి
మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 18 (సంగారెడ్డి) సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి రాంనగర్ రామ్ మందిర్ లో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద బుధవారం రాత్రి ఘనంగా సంగీత విభావరి నిర్వహించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు భక్తి గీతాలు ఆలపించి భక్తులను అలరించారు. అంతకుముందు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గణపతి మండపంలో డోలక్ వాయిస్తూ భజన పాటలు పాడారు. ఓవైపు భక్తి గీతాలు మరోవైపు భజన పాటలతో రామ్ మందిర్ ప్రాంతం మార్మోగింది.
గురువారం తెల్లవారుజాము వరకు ఈ సంగీత విభావరి కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, జయా రెడ్డి పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

