📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్*శ్రీనివాస్ నగర్ అభివృద్ధికి మరో అడుగు.. రూ.23 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన*

*శ్రీనివాస్ నగర్ అభివృద్ధికి మరో అడుగు.. రూ.23 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన*

📰 Generate e-Paper Clip

*శ్రీనివాస్ నగర్ అభివృద్ధికి మరో అడుగు.. రూ.23 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన*

మేడ్చల్ కీసర, సెప్టెంబర్ 21

మేడ్చల్ జిల్లా: కీసర డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. కాలనీలో రూ.23 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కీసర డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే కాలనీవాసుల రాకపోకలకు ఇబ్బందులు తొలగడంతో పాటు, రహదారి సౌకర్యం మరింత మెరుగుపడుతుందని స్థానికులు తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని కాలనీవాసులు కోరారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, కీసర మాజీ ఎంపీటీసీ బెలిదే రమేష్ గుప్తా, మాజీ ఉపసర్పంచ్ తాటాకం లక్ష్మణ్ శర్మ, మాజీ ఎంపీపీ రామారం సుజాత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాటాకం వెంకటేష్ శర్మ, పోలగోని దయానంద్ గౌడ్, చిక్కుడు రమేష్ ముదిరాజ్, ముద్దం వెంకటేష్ యాదవ్ కీసరగుట్ట మాజీ ట్రస్టు బోర్డు సభ్యులు జూపల్లి సాయిలు, పోచబోయిన రాజు యాదవ్, రెడ్డబోయిన ప్రవీణ్ ముదిరాజ్, మహిళా నాయకురాలు కర్రె బాలమణి, యువ నాయకులు ముద్దం మల్లేష్ యాదవ్, దంతోజి వెంకట్,శ్రీనివాస్ నగర్ కాలనీ అధ్యక్షుడు పూండ్రు రాకేష్, ప్రధాన కార్యదర్శి చినింగని మల్లేష్, ఉపాధ్యక్షుడు మొరుగు నర్సింహా, కమిటీ సభ్యులు శీలం మల్లేష్, రాజు గుప్త, శ్యామ్ సుందర్, రాజిరెడ్డి, మొరుగు స్వామి, హరికృష్ణ, కర్రే గణేష్, కీసర మండల సామాజిక సేవా కార్యకర్త తుడుం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.