📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapet*వడ్లగూడెం ప్రభుత్వ పాఠశాల లో వంట మనిషి లేక ఇకట్లు

*వడ్లగూడెం ప్రభుత్వ పాఠశాల లో వంట మనిషి లేక ఇకట్లు

📰 Generate e-Paper Clip

*వడ్లగూడెం ప్రభుత్వ పాఠశాల లో వంట మనిషి లేక ఇకట్లు*

వడ్లగూడెం,ప్రజావాణి న్యూస్, సెప్టెంబర్ 15:
అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామం ప్రభుత్వ పాఠశాల లో వంట మనిషి లేక భోజనం వండడానికి ఇబంది అవుతుంది అని స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు భూ భారతి సర్వే నిమిత్తం వచ్చిన ట్రైని డిప్యూటీ కలెక్టర్ కు విన్నవించారు. భూ భారతి భూ సర్వే లో భాగంగా పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మురళి వెళ్ళగా నేరుగా వంటశాల కు వెళ్లి వంట చేస్తున్న వంట మనిషి ని మెనూ ఆధారంగా వండడం లేదు అని అడగగా తాత్కాలిక వంట మనిషిని నాకు ఏమీ తెలియదు అని బదులు ఇవ్వడం జరిగింది.దానికి ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మురళి ఏం తెలియకపోవడమేంటి మెనూ చెప్పడం లేదా అని అడగగా అక్కడ ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఈమె వంట మనిషి కాదు సార్ మేమే బ్రతిమలాడుకొని పిల్లలకు వడ్డించమని చెప్పడం జరిగింది అని,మా పాఠశాలకు వంట మనిషి లేక చాలా ఇబ్బంది గురవుతున్నామని చాలా సార్లు ప్రజా ప్రతినిధులకు తెలిపాం అని చెప్పారు. దానికి సర్పంచ్ ని అడగ ఇక్కడ చదివే విద్యార్థులు చాలా తక్కువ మంది ఉండడం చేత,ఇచ్చే శాలరీ వంట వాళ్లకు సరిపోవడం లేదు అని ఎవరు వంట చెయ్యడానికి ముందుకు రావడం లేదు అని సర్పంచ్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కి తెలిపారు.దానికి సానుకూలంగా స్పందించిన మురళి తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.