రోడ్డుపై మార్కెట్‌ నిర్వహణ కోసం వ్యాపారుల ధర్నా

*రోడ్డుపై మార్కెట్‌ నిర్వహణ కోసం వ్యాపారుల ధర్నా* *తాత్కాలికంగా అనుమతి ఇచ్చిన సిఎంసి అధికారులు* అమీన్పూర్‌, సెప్టెంబర్‌ 20 (ప్రజావాణి):అమీన్పూర్‌ ప్రధాన రహదారిపై కూరగాయల మార్కెట్‌ నిర్వహించుకునేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక వ్యాపారులు గాంధీ బొమ్మ వద్ద ధర్నాకు దిగారు. అధికారులు కేటాయించిన ప్రాంతంలో మార్కెట్‌ నిర్వహిస్తే ప్రజలు రావడం లేదని, దీంతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రధాన రహదారిపై మార్కెట్‌ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని సిఎంసి అధికారులు...