📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్దేశభక్తి బృందగాన పోటీల్లో పీవీ పాఠశాల విద్యార్థులకు ప్రథమ బహుమతి

దేశభక్తి బృందగాన పోటీల్లో పీవీ పాఠశాల విద్యార్థులకు ప్రథమ బహుమతి

📰 Generate e-Paper Clip

దేశభక్తి బృందగాన పోటీల్లో పీవీ పాఠశాల విద్యార్థులకు ప్రథమ బహుమతి

వందేమాతరం గీతాలాపనలో ప్రతిభ.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

మేడ్చల్:(ప్రజావాణి)

మేడ్చల్‌లోని పీవీ ఉన్నత పాఠశాల విద్యార్థులు దేశభక్తి బృందగాన పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు. భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుభాష్ నగర్‌లోని శ్రీ గాయత్రి స్కూల్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించి విజేతలుగా నిలిచారు.

జానపద, ప్రాంతీయ విభాగంలో పీవీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి బహుమతిని సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులు తమ గాన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుని పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత వికాస్ పరిషత్ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు పసుపులేటి నరేంద్ర కృష్ణ, తెలంగాణ ప్రాంత ప్రధాన కార్యదర్శి శివ రామకృష్ణ, ప్రాంత సేవా కన్వీనర్ కట్టే శ్రీకాంత్, సంపర్క్ ప్రముఖ్ లవ కుమార్ గౌడ్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ శాఖ అధ్యక్షుడు సాయి దీప్, శాఖ కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్, ఏపీజే అబ్దుల్ కలాం శాఖ కార్యదర్శి ఆర్.ఎన్. చారి, బల్వంత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అతిథులు విద్యార్థులను ఉద్దేశించి దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, జాతీయ భావాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరిలో దేశం పట్ల బాధ్యత, గౌరవం ఉండాలని సూచించారు.

పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన పీవీ పాఠశాల విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయం సాధించి పాఠశాలకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.