రాములు కుటుంబానికి బీఆర్ఎస్ నేతల పరామర్శ
చెన్నారావుపేట సెప్టెంబర్ 28 ప్రజావాణి
మండలంలోని వాల్య తండకు చెందిన మాజీ వార్డు మెంబర్ బోడ వీరస్వామి తండ్రి రాములు ఆకస్మిక మృతి తీవ్ర విచారకరమని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బాల్నే వెంకన్న అన్నారు. సోమవారం బాధితుల నివాసానికి వెళ్లిన ఆయన, రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదారుస్తూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్, మాజీ సొసైటీ చైర్మన్ మురహరి రవి, సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్, స్థానిక నాయకులు రవి, రమేష్, మంగీలాల్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

