📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetయువ టూరిజం క్లబ్ జిల్లా స్థాయి పోటీల్లో నంగునూరు జెడ్పీహెచ్‌ఎస్‌కు ద్వితీయ బహుమతి

యువ టూరిజం క్లబ్ జిల్లా స్థాయి పోటీల్లో నంగునూరు జెడ్పీహెచ్‌ఎస్‌కు ద్వితీయ బహుమతి

📰 Generate e-Paper Clip

 

నంగునూరు, సెప్టెంబర్‌ 26:పాఠశాల విద్యాశాఖ, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన యువ టూరిజం క్లబ్ జిల్లా స్థాయి పోటీల్లో నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతి సాధించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రంగనాయక సాగర్‌ వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు జిల్లా ద్వితీయ బహుమతి, ప్రశంసా పత్రంతో పాటు రూ.12,000 నగదు బహుమతిని అందజేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ హైమావతి, టూరిజం శాఖ జిల్లా అధికారి విజయ్ భార్గవతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.

 

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన నంగునూరు జెడ్పీహెచ్‌ఎస్ యువ టూరిజం క్లబ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వర్గాలు వెల్లడించాయి. విద్యార్థులు పర్యాటక ప్రదేశాలు, తెలంగాణ సంస్కృతి, చారిత్రక వారసత్వం, స్థానిక పర్యాటక ప్రాధాన్యత వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు తమ ప్రతిభను పోటీల్లో ప్రదర్శించారు.

ఈ యువ టూరిజం క్లబ్‌కు పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎర్రన్నగారి రాంగోపాల్ రెడ్డి గైడ్ టీచర్‌గా, కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ విద్యార్థులను పోటీలకు సిద్ధం చేశారు.

విద్యార్థులకు అభినందనలు

పాఠశాలకు జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి లభించడం పట్ల ప్రధానోపాధ్యాయులు గొట్టిపర్తి రామస్వామి గౌడ్, మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందిస్తూ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా పాఠశాల తరఫున విద్య, క్రీడలు, సాంస్కృతిక, సృజనాత్మక, పర్యాటక తదితర రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. యువ టూరిజం క్లబ్ ద్వారా విద్యార్థులకు తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక విశేషాలపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

జిల్లా స్థాయి పోటీల్లో సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.