*మిషన్ భగీరథ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలి*
*ప్రతి నల్లాకు ఆన్–ఆఫ్ బటన్ ఏర్పాటు చేసుకోవాలి:*
*ఏఈ మాల్యాద్రి*
*
మంచాల, సెప్టెంబర్ 22 (ప్రజావాణి):
మంచాల మండల కేంద్రంలోని మంచాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ – జలార్పణ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ మాల్యాద్రి పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఏఈ మాల్యాద్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా అందుతున్న తాగునీటిని ప్రజలు వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని సూచించారు. ప్రతి ఇంటి నల్లాకు ఆన్–ఆఫ్ బటన్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. మిషన్ భగీరథ నీటి సరఫరా వచ్చి ఆగిపోయిన తర్వాత నల్లాలను అలాగే వదిలేస్తే ట్యాంకుల్లోని నీరు వెనక్కి వెళ్లి కలుషితమయ్యే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
గ్రామంలో తాగునీటి సమస్య ఉన్నందున కొత్తగా ఐదు బోర్లు వేయించాలని, అలాగే మిషన్ భగీరథ పైప్లైన్లకు అవసరమైన మరమ్మతులు చేపట్టి ప్రతి ఇంటికీ నీరు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ ఏర్పుల మానస వినయ్ కోరారు. ముఖ్యంగా గ్రామంలోని 1, 2, 3 వార్డుల్లో మిషన్ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదని, సంబంధిత అధికారులు వెంటనే పైప్లైన్లను పరిశీలించి మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని అన్నారు.
గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సర్పంచ్ కోరారు. నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, గ్రామ ఉపసర్పంచ్ పందుగుల లింగం గౌడ్, వార్డు సభ్యులు గ్యార జంగయ్య, పుడుత సాయిలు, నీళ్ల పారిజాత, కృష్ణ, గడ్డం పారిజాత, బాబయ్య, దూసరి కల్పన కుమార్, మాజీ

