📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetఆర్యవైశ్య సంఘం ఎన్నికల ఫలితాలు కోదాడలో కాంగ్రెస్ పతనానికి నాంది..

ఆర్యవైశ్య సంఘం ఎన్నికల ఫలితాలు కోదాడలో కాంగ్రెస్ పతనానికి నాంది..

📰 Generate e-Paper Clip

ఆర్యవైశ్య సంఘం ఎన్నికల ఫలితాలు కోదాడలో కాంగ్రెస్ పతనానికి నాంది..

 

మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్..

కోదాడ, సెప్టెంబర్ 10/ ప్రజావాణి

నిన్న జరిగిన ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పైడిమర్రి నారాయణరావు ని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో పైడిమర్రి నారాయణరావు సాధించిన గెలుపు, కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరియు ఉత్తమ్ పద్మావతిల ఓటమికి పునాది వేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కోదాడ నియోజకవర్గంలో కొనసాగుతున్న అరాచక, అకృత్య, అవినీతి పరిపాలనకు వ్యతిరేకంగా వ్యాపార వర్గాలు ఇచ్చిన స్పష్టమైన తీర్పే ఈ విజయానికి నిలువెత్తు నిదర్శనమని ఆయన విమర్శించారు.

ర్యవైశ్య సంఘం ఎన్నికల్లో వ్యాపార వర్గాలు ఇచ్చిన ఈ తీర్పు, రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, ఉత్తమ్ పద్మావతికి ఎదురుకాబోయే ఘోర పరాభవానికి ప్రత్యక్ష నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.