📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyమంచాల గ్రామంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

మంచాల గ్రామంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

📰 Generate e-Paper Clip

*మంచాల గ్రామంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం🇮🇳*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా:
(ప్రజా వాణి ) సెప్టెంబర్ 17.మంచాల మండల కేంద్రమైన మంచాల గ్రామంలో గ్రామపంచాయతీ ముందు ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మానస జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు….

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పాందుగుల లింగం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎడమ నరేందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు రావుల శ్రీనివాస్, వార్డు సభ్యులు గ్యార జంగయ్య, నీళ్ల పారిజాత కృష్ణ, గడ్డం పారిజాత బాబయ్య, మాజీ MPTC రావుల మల్లయ్య నాయకులు ఎరుకొండ రాములు, గ్యార జగన్, ఎలామోని యాదయ్య, ఏర్పుల అశోక్, పొనగంటి సంపత్ రెడ్డి, రావుల ఐలయ్య, యువత గడ్డం కిషోర్, గ్యార శరత్, రావుల ఆనంద్ పాటు గ్రామస్థులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.

అనంతరం ప్రజా పాలనలో భాగంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలోని పరిస్థితులను పరిశీలించారు.

అదేవిధంగా మంచాల గ్రామంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హోమ కార్యక్రమంలో *సర్పంచ్ మానస వినయ్* పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు మరియు గ్రామ అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.