📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజానకి నగర్‌లో జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ

జానకి నగర్‌లో జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

జానకి నగర్‌లో జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ
చిలుకూరు: మండలంలోని జానకి నగర్ గ్రామపంచాయతీ పరిధిలో సెప్టెంబర్ 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్‌ను కాంగ్రెస్ పార్టీ చిలుకూరు మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు బర్మావత్ రాజేష్ నాయక్, గ్రామ సర్పంచ్ బానోతు అనూష రవికుమార్, ఉపసర్పంచ్ రాఘవేంద్రరావు, వార్డు సభ్యులు బర్మావత్ స్వాతి, వాసు తదితరులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాబ్ మేళాలో వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నందున విద్యార్థులు, విద్యార్థినులు, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అర్హత కలిగిన యువత తమ విద్యార్హతలు, బయోడేటాతో జాబ్ మేళాకు హాజరై ఉద్యోగ అవకాశాలను పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బట్టు అమర్నాథ్, గ్రామ కాంగ్రెస్ నాయకులు సురేష్, నాగు, చెత్తర్, శివాజీ, బానోతు వీరేష్‌తో పాటు గ్రామ పెద్దలు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.