📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyభూములు, ఇండ్లు కోల్పోకుండా న్యాయం చేయాలి

భూములు, ఇండ్లు కోల్పోకుండా న్యాయం చేయాలి

📰 Generate e-Paper Clip

భూములు, ఇండ్లు కోల్పోకుండా న్యాయం చేయాలి

ఎమ్మెల్యే కాలే యాదయ్యకు సంకేపల్లిగూడ రేడియల్ రింగ్ రోడ్డు బాధితుల వినతి పత్రం

రంగారెడ్డి జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్ 18

షాబాద్ మండలం సంకేపల్లిగూడ గ్రామంలో రేడియల్ రింగ్ రోడ్డు నిర్మాణం కారణంగా భూములు, ఇండ్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని బాధిత రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించి, భూములు మరియు ఇండ్లు కోల్పోకుండా న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం ఎమ్మెల్యే కాలే యాదయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ రేడియల్ రింగ్ రోడ్డు కోసం తమ భూములు, నివాసాలను కోల్పోయే పరిస్థితి రావడంతో కుటుంబాల భవిష్యత్తుపై ఆందోళన నెలకొందన్నారు. తమ అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు. బాధితుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కుమ్మరి చెన్నయ్య భూ బాధితులు వెంకట్ రెడ్డి శ్రీధర్ రెడ్డి జగదీశ్ రెడ్డి ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.