📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaభగత్ సింగ్ పోరాట స్ఫూర్తితోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం

భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం

📰 Generate e-Paper Clip

*భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం

 

SFI తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్

 

 

 

 

ప్రజాస్వామ్య వ్యవస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసిన జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి*

ఎస్‌ఎఫ్‌ఐ పరకాల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో *”ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లు

సెమినార్

పరకాల:

అమరవీరుడు భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని, నేటి పాలకుల నిరంకుశ పోకడల నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ పరకాల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్ల*అనే అంశంపై నిర్వహించిన విస్తృత స్థాయి సెమినార్‌లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు.

సందర్భంగా దామెర కిరణ్ మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థలు కేంద్ర పాలకుల చేతిలో బంధీలుగా మారుతుండటం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రధానంగా జ్ఞానేశ్ కుమార్ అవలంబిస్తున్న పక్షపాత ధోరణి, ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్య పునాదులనే కదిలిస్తున్నాయని విమర్శించారు.

జ్ఞానేశ్ కుమార్ హయాంలో రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉంటూ నిష్పాక్షికంగా వ్యవహరించాల్సి ఉండగా, అధికార పక్ష ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కరూ అన్నారు.

ఎన్నికల నిర్వహణ, విధివిధానాల్లో ప్రజాస్వామ్య సూత్రాలను పక్కనబెట్టి, అత్యంత గోప్యంగా మరియు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం. ప్రజాస్వామ్యం కి తూట్లు పొడవటం మే అని వాపోయారు.

రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక సూత్రాలకు, సమానత్వ హక్కులకు విఘాతం కలిగిస్తూ నిర్ణయాలు అమలు చేయడం.అనేది నియతల వ్యవహరించటం వల్లన ప్రజాస్వామ్య దేశం లో అలాంటి నియంతలకు చోటు లేదు అన్నారు.

స్వయంప్రతిపత్తి కలిగిన వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసి, ప్రజలకు ఆయా వ్యవస్థలపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా సడలేలా చేయడం.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని దామెర కిరణ్ డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత విద్యార్థి లోకంపైనే ఉందన్నారు. యువత, విద్యార్థులు చైతన్యవంతమై రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సెమినార్‌లో ఎస్‌ఎఫ్‌ఐ పరకాల డివిజన్ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, వివిధ కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ పరకాల మండల అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మండల కార్యదర్శి సాయి తేజ పరకాల పట్టణ అధ్యక్షుడు బొజ్జ హేమంత్ పట్టణ కార్యదర్శి అఫ్రోజ్ పరకాల పట్టణ గర్ల్స్ కన్వీనర్ శ్రీ వర్ష శాయంపేట మండల అధ్యక్షుడు ఇస్మాయిల్

 

మండల ఉపాధ్యక్షుడు రాహుల్

పట్టణ ఉపాధ్యక్షుడు వినీత్ సన్నీ విద్యా

ర్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.